
గొల్లపల్లి గ్రామంలో గోదాం నిర్మాణానికి ముప్పై లక్షల నిధుల మంజూరుకు వినతి
మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ సానుకూలంగా స్పందించిన మంత్రి
TS తెలుగు న్యూస్ 24/7: హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను రాచర్ల గొల్లపల్లి గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఈజీఎస్ నిధుల ద్వారా 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి రూ.30,00,000/- (ముప్పై లక్షలు) మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామంలో సుమారు 75 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, గ్రామంలో ధాన్యం నిల్వ చేసుకునేందుకు సరైన గోదాం సౌకర్యం లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీంతో పంటను తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మంత్రికి వివరించారు. వినతిపత్రంపై వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్,సంబంధిత అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
సర్పంచ్ వెంట బొప్పాపూర్ ఉపసర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి,యువకులు పొన్నాల వెంకటేష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి కలరు.





