బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆరోగ్య భీమా – బీజేపీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణం చున్నం లక్ష్మి నగర్, వికాస్ నగర్ మరియు ఏసీసీ ఏరియా లో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మరియు అభివృద్ది కొరకు బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది.
కేవలం బీజేపీ పార్టీ తోనే సూపరి పాలన సాధ్యం అని బీజేపీ ప్రకటించి మానిఫెస్టో లో అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందేలా రూపొందించడం జరిగింది అని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని రఘునాథ్ తెలిపారు.
