ప్రాంతీయం

99 రోజుల కార్యాచరణలో ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలతో డాక్యుమెంట్ చేయాలి.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్

2 Views

99 రోజుల కార్యాచరణలో ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలతో డాక్యుమెంట్ చేయాలి.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్

మంచిర్యాల జిల్లా ,జూన్ 25, 2026:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ఫలితాలు, భవిష్యత్తు కార్యచరణపై నివేదిక సిద్ధం చేయాలని, ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలపై డాక్యుమెంట్ రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో 99 రోజుల పాటు చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,  జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులకు సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రతి గ్రామంలో 4 రకాల చెత్త నిర్వహణ చేపట్టాలని, వ్యర్ధాల నుంచి ఉపయోగకర ఉత్పత్తుల తయారీకి చర్యలు తీసుకోవాలని తెలిపారు. లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ కొరకు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆధ్వర్యంలో తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరిలో ఊట కుంట ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, దాదాపు 50 లక్షల మంది మహిళలకు పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు తయారుచేసే అవకాశాన్ని స్వయం సహాయక సంఘాలకు కల్పించి ఆదాయ వనరులను పెంపొందించడం జరిగిందని తెలిపారు. దాదాపు 1 లక్ష మంది విద్యార్థులకు దుస్తులు అందించడం జరిగిందని, విద్యా సంస్థల సమీపంలో ఎలాంటి మురికి ప్రాంతాలు లేకుండా శుభ్రపరచాలని తెలిపారు. మాదకద్రవ్యాలు, గంజాయి వంటి హానికర పదార్థాలను పూర్తిగా నిరోధించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పంట మార్పిడి విధానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పంట మార్పిడి వల్ల కలిగే లాభాలపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని, అదనపు ఆదాయాన్ని వృద్ధి చేసుకునేలా అవసరమైన మెలకువలు అందించాలని తెలిపారు. విద్య ఆవశ్యకతను తెలుసుకొని ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ చర్యలు తీసుకుంటుందని, ప్రతి ఒక్కరూ చదువుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో విద్యారంగంలో అమలు చేస్తున్న విధానాలు అభినందనీయమని, భవిష్యత్తులో ఇలాగే కొనసాగించాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులతో సెంట్రింగ్ యూనిట్లు, ఫ్లై యాష్ బ్రిక్స్ యూనిట్ల ఏర్పాటుతో పాటు ఇతర వ్యాపార రంగాలలో రాణించేలా చేయూత అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. త్వరలో ప్రభుత్వం పింఛన్ల విషయంలో ప్రజలకు శుభవార్త చెబుతుందని, పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల జీవన ప్రామాణికరణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఇన్స్టంట్ స్పౌస్ పెన్షన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని, ఈ క్రమంలో ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని, సంబంధిత పరిష్కార నివేదిక పత్రాలను పోర్టల్ లో నమోదు చేయాలని, సమస్యల పరిష్కార విధానం నిజాయితీగా, పారదర్శకంగా ఉండాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 3 వేల 73 మంది వ్యాధిగ్రస్తులను పరీక్షించి 251 మంది చిన్నపిల్లల వైద్య నిపుణుల ద్వారా అందించడం జరిగిందని, క్షయ నిర్మూలనలో భాగంగా 3 వేల 190 మంది అనుమానితులకు ఎక్స్ రే తీసి 89 మంది వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. యాంటీబయోటిక్ అధిక వినియోగంపై నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అధిక మొత్తంలో సదరం శిబిరాలలో దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. అరవై అలైవ్ లో భాగంగా రహదారి భద్రతా నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరచడం జరిగిందని, ప్రమాద ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని వసతి గృహాలలో పారిశుధ్యం, ఆహార నాణ్యత, విద్యార్థుల సంక్షేమంపై చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. బడిబాట కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థుల సంఖ్య పెంపొందించడం జరిగిందని, జిల్లాలో బాలికల విద్య పై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందని, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో భోజనశాల, అదనపు గదుల నిర్మాణం చేపట్టి అవసరమైన సామాగ్రి సమకూర్చడం జరిగిందని, ఈ విద్యాలయాలలో పరిమితికి మించి అడ్మిషన్లు అందించి విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనాధలు, ఒక తల్లి/తండ్రి గల పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, నిత్యవసరాలు అందించడం జరుగుతుందని తెలిపారు. రైతు వేదికలలో సమావేశాలు నిర్వహించి భూసార పెంపుదల, ఎరువుల బుకింగ్, ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పంట మార్పిడి విధానాలపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ఇప్పటివరకు 10 వేల 305 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, 2 వేల 132 ఇండ్లు నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, మిగతా పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వి.బి.జి. రాంజీ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అధికారులు తమ పరిధిలోని గ్రామపంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని, పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు అందించాలని, త్వరలో కార్మికులకు బీమా సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్ధాల నియంత్రణ, కుక్కలు, కోతుల బెడద నివారణ పై చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీధి దీపాల మార్పిడిలో అక్రమాలకు తావు లేకుండా పర్యవేక్షించడంతో పాటు సోలార్ విద్యుత్ ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ ఆర్థిక వనరుల అభివృద్ధి దిశగా ప్రణాళిక రూపొందించుకుని తదనగుణంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *