తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ బీజేపీ పార్టీ చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు జైపూర్ మండలంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. తర్వాత బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ మాట్లాడుతూ నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పువ్వుకి తమ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని జైపూర్ మండల ప్రజలను దుర్గమ్మ అశోక్ కోరారు.
