నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి గోడలను, నాలుగు సీసీ కెమెరాలు కొందరు వ్యక్తులు కూల్చివేసిన వారిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాయపోల్ ఎస్ఐ మానస అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాయపొల్ మండల పరిధిలోని ముంగిస్ పల్లి ఎస్సీ కాలనీలో మన్నె రేణుక రమేష్ దంపతులకు ప్రభుత్వం నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు మంజూరు కాగా ఇటీవల నిర్మాణ పనులు చేపట్టారు. అట్టి నిర్మాణం 347/అ/3 సర్వే నెంబర్ లో 3 గుంటలు, 347/అ సర్వే నెంబర్ లో 3 గుంటలు మొత్తం 6 గంటల విస్తీర్ణం గల వారి సొంత భూమిలో ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. అదే గ్రామానికి చెందిన మన్నె నర్సయ్య, కుమారులు బాల సాయి, కిషోర్ తో పాటు స్వీటీ, సాయి, లక్ష్మి, రేఖ, యాదమ్మ, మరి కొంతమంది కలిసి ఇంటి పై దాడి చేసి నిర్మాణంలో ఉన్న గోడలను కూల్చివేసి నాలుగు సీసీ కెమెరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే మన్నె రేణుక రమేష్ దంపతులపై బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారు. వెంటనే బాధితులు మన్నే రేణుక రమేష్ దంపతులు పోలీసులను సంప్రదించి పైన తెలిపిన వ్యక్తులతో మాకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయగా సదరు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని రాయపోల్ ఎస్ఐ మానస తెలిపారు.





