రాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేద్దాం ..
బహుజనుల ఐక్యతతో జులై 5న చరిత్ర సృష్టించనున్న టిఆర్పి ..తీన్మార్ మల్లన్న నాయకత్వంలోనే రాజ్యాధికారం ..జులై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి” సభను విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు మహేష్ వర్మ ఆధ్వరంలో మంగళవారం రోజున మంచిర్యాల జిల్లా కేద్రంలోని పలు బిసి సంఘాల నాయకులకు, బిసి కుల సంఘాల నాయకులను కలిసి ఆహ్వాన పత్రికను అందించి వారిని సాదరంగా ఆహ్వానించడం జరిగింది. అనంతరం మహేష్ వర్మ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో వచ్చేది బిసి రాజ్యమే అని, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న నాయకత్వంలోనే రాజ్యాధికారం సాధ్యం అవుతుందని అన్నారు, ఎవరేంతో వారికంత వాటా దక్కుతుందని తెలిపారు. సామాజిక తెలంగాణ నిర్మాణమే తీన్మార్ మల్లన్న లక్ష్యం అని స్ఫష్టం చేశారు. జులై 5 తారీకు గుర్తు వస్తే అగ్రవర్ణ నాయకుల వెన్నులో వణుకుపుట్టేలా సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. “రాజ్యాధికార సమరభేరి” సభలో బహుజనుల గర్జన రాష్ట్ర నలుమూలలా ధ్వనించనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. జులై 5వ తేదీ చరిత్రలో గుర్తుండిపోతుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న బహుజనులు పార్టీలకు, సంఘాలకు అతీతంగా పాల్గొని సభ వియజయవంతంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ మహమ్మద్ లతీఫ్, జిల్లా నాయకులు పడాల శివతేజ, బూర రవీందర్, బొంగొని విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.





