
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కి నివాళులు
- TS తెలుగు న్యూస్ 24/7: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షులు రామచంద్రారెడ్డి
పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలిదాన్ దివస్ సందర్భంగ పార్టీ దేశ సమైక్యత జాతీయ సమగ్రత కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణయం ఒకే దేశంలో రెండు విధానాలు రెండు జెండాలు రెండు ప్రధానులు ఉండరాదు అని కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించిన నాయకులు. సంకల్పం భారతదేశ ఏకత్వానికి మార్గదర్శకంగా నిలిచిందని ఈ దేశం కోసం ఆత్మబలిదానం చేసుకున్న గొప్ప సంఘసంస్కర్త జాతీయవాది మహనీయులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ సేవలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కృష్ణహరి,జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి,పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ గౌడ్,సీనియర్ నాయకులు బండారపు లక్ష్మారెడ్డి,ఉడుగుల యాదగిరి,అంతర్పుల తిరుపతి, రంజిత్ కుమార్,రమేష్ నాయక్,సాయికుమార్, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.





