మంచిర్యాలలో బీఆర్ఎస్ కు షాక్
మంచిర్యాల, లక్షట్టిపెట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బీజేపీలో చేరిక
నేడు బీజేపీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుండి బిజెపి పార్టీలోకి మంచిర్యాల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్ రావు, లక్షట్టిపెట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి సంధ్యా జగన్మోహన్ రెడ్డి లు చేరడం జరిగింది. వారికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.






