ప్రాంతీయం

రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

2 Views

రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా,జూన్ 21, 2026:
రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి (చందారం) లో చందారం గ్రామ రైతు పొదుపు, పరపతి, మార్కెటింగ్ పరస్పర సహాయక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ విత్తన ఉత్పత్తి – విత్తన శుద్ధి కేంద్రాన్ని డి.సి.పి. ఎ.భాస్కర్, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమం దిశగా అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు. జిల్లాలోని రైతుల కొరకు విత్తన ఉత్పత్తి – విత్తన శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందు కొరకు అవసరమైన మెటీరియల్, ఎక్విప్మెంట్ సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు 2 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ఇంకా 12 వేల క్వింటాళ్లు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అవసరమైన లారీలను సమకూర్చడం జరిగిందని, సింగరేణి సంస్థ, ఇసుక తరలింపు సంబంధిత లారీలను ధాన్యం కొరకు మళ్ళించడం జరిగిందని తెలిపారు. వర్షాలు రాకముందే ధాన్యం కొనుగోలు చేసి కేటాయించిన ప్రకారం గోదాములు, రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు చేసిన 48 గంటల వ్యవధిలో చెల్లింపులు చేయడం జరిగిందని, దాదాపు 98 శాతం ధాన్యం కొనుగోలు సంబంధించి ఆయా రైతుల ఖాతాలలో నగదు జమ చేయడం జరిగిందని తెలిపారు. భూ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడంతో పాటు రైతుల నమోదు ప్రక్రియ చేపట్టడం జరిగిందని, రైతు సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆధార్ లింకేజీ ద్వారా యూరియా, విత్తనాలు, ధాన్యం విక్రయ బుకింగ్ చేయడం జరుగుతుందని, సాదా బైనమా దరఖాస్తులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. శాంతిభద్రతలు, సివిల్, కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు మారుమూల గ్రామాలలో సర్వే నిర్వహించడం జరుగుతుందని, పట్టాదారు, మోకా వివరాలు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అధికారుల సమన్వయంతో సర్వే ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ఆధార్, భూధార్ ప్రక్రియ పరిశీలన పకడ్బందీగా చేపట్టే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. పంట సాగులో రైతులు లబ్ధి పొందే విధంగా పంట మార్పిడి విధానం, సాగు మెలకువలు, లాభాలు, భూసారం పరిరక్షణ, నానో యూరియా వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు తో పాటు దాదాపు 22 వేల టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేయడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా 452 కోట్ల చెల్లింపులు కాగా మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపు 270 కోట్ల చెల్లింపులు జరిగాయని తెలిపారు. ఈసారి ఐ.కె.పి. వారికి కొనుగోలు కేంద్రాలు కేటాయించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా 20 శాతం కొనుగోలు కేంద్రాలు ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. కడెం కాలువ 42వ డిస్టిబూటరీ నుండి నీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో లారీలు, హమాలీల సమస్య లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని, గతంలో ఎకరాకు 20 నుండి 22 క్వింటాళ్లు ధాన్యం దిగుబడి రాగా ఈసారి 28 నుండి 32 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చిందని తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం లేకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం గోదాములకు తరలించి తగు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలతో రైతులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, రైతు సంక్షేమంలో రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని తెలిపారు. పంట సాగుకు సరిపడా సాగునీరు అందించడం జరిగిందని, పంట ఉత్పత్తికి అవసరమైన గోదాములు ఏర్పాటు చేసి అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, విత్తన శుద్ధి కేంద్రం ద్వారా మార్కెట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *