టీజీసెట్ 2026 ఫేజ్-1 ఫలితాలు విడుదల
తెలంగాణ, ఏప్రిల్ 8, తెలుగు న్యూస్ 24/7
తెలంగాణ : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన( టీజీసెట్) 2026 ఫేజ్-1 ఫలితాలను సంక్షేమశాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మంగళవారం విడుదల చేశారు.2026-27 విద్యా సంవత్సరానికి 6 నుంచి 9 తరగతుల వరకు బ్యాక్‌లాగ్ ఖాళీలతో పాటు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పరిగి,ఖమ్మంలో 8 తరగతి ప్రవేశాలకు ఈ ఫలితాలు విడుదలయ్యాయి.ఫేజ్-1లో 6,242 సీట్లు భర్తీ చేశారు.ఎంపికైన విద్యార్థులు ఏప్రిల్ 7 నుండి 20 వరకు ధృవపత్రాలతో హాజరుకావాలి..





