ముస్తాబాద్ డిసెంబర్ 13, ముస్తాబాద్ మండల పరిధిలోని సేవలలాల్ గ్రామానికి చెందిన దరంసోత్ ప్రకాష్ నాయక్ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారని. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాలలో 9 నుండి 11వ తేదీ వరకు రాష్ట్ర మహాసభలు జరిగాయని రాష్ట్ర మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నుకున్నారని అందులో భాగంగా తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తానని రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యనందే విధంగా ఏబీవీపీ తరఫున పోరాటం చేస్తానని తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ప్రకటించినందుకు రాష్ట్ర కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసారని ఆయన పేర్కొన్నారు.
