
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య: ఎంఈఓ గాలిపల్లి కృష్ణహరి
తొమ్మిది గ్రామాల్లో అందుబాటులో నర్సరీ,ఎల్ కే జీ, యూకేజీ
TS తెలుగు న్యూస్ 24/7: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట,తిమ్మాపూర్ అగ్రహారం,గ్రామాలలో ఇప్పటికే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్య అమల్లో ఉండగా తాజాగా 2026 – 27 విద్యా సంవత్సరంలో మరో ఆరు గ్రామాలలోనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యను అందించడానికి ప్రభుత్వం అనుమతించిందని మండల విద్యాధికారి గాలిపెల్లి కృష్ణ హరి తెలిపారు.బొప్పాపూర్ కిషన్ దాస్ పేట నారాయణపూర్ బండలింగంపల్లి దుమాల వెంకటాపూర్ గ్రామాలలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగు సంవత్సరాల వయసు నిండిన పిల్లలను చేర్పించి ప్రీ ప్రైమరీ (నర్సరీ,ఎల్ కే జీ యూకేజీ) విద్యను అందించడానికి జూన్ 12 నుండి తరగతులు నిర్వహించబడునని 9 గ్రామాల ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రభుత్వ ఫ్రీ ప్రైమరీ విద్యను వినియోగించుకొని తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలని మండల విద్యాధికారి సూచించారు.





