ప్రాంతీయం

చెన్నూర్‌లో విత్తనాలు,ఎరువుల దుకాణాల తనిఖీలు

6 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*చెన్నూర్‌లో విత్తనాలు,ఎరువుల దుకాణాల తనిఖీలు*

*నకిలీ విత్తనాలపై ప్రత్యేక దృష్టి.. నిబంధనలు పాటించాలని వ్యాపారులకు హెచ్చరిక*

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు చెన్నూర్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ఏడీఈ,ఏఓ అధికారులతో కలిసి విత్తనాలు,ఎరువుల దుకాణాలు, గోదాములపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు.
వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.దుకాణాల్లో నిల్వ ఉంచిన విత్తనాల బిల్లులు, లైసెన్సులు,స్టాక్ రిజిస్టర్లు,నిల్వ విధానం తదితర అంశాలను పరిశీలించారు.
అనుమానాస్పద విత్తనాలను విక్రయించినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. రైతులు ధృవీకరించిన దుకాణాల నుంచే విత్తనాలను కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని అధికారులు సూచించారు.ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.రైతులను మోసం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని చెన్నూర్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్ తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *