ఫిబ్రవరి 05: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు అల్మాస్పూర్ గ్రామానికి చెందిన కస్తూరిబా బాలికల పాఠశాల లో 1996-97 సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు ప్రస్తుత పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వచ్చే నెలలో పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ స్కేలు పెన్ను పెన్సిల్ రబ్బర్ చాక్ మార్ లు పంపిణీ చేశారు విద్యార్థులను ఉద్దేశించి కాళోజి నారాయణ కొమిరిశెట్టి శ్రీనివాస్ జ్యోతి లు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాచర్ల బొప్పాపూర్ హైస్కూల్ కు ఎంతో ప్రాధాన్యత ఉందని ఈ స్కూల్ నుండి ఎందరో ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యే, సైంటిస్టులు, బిజినెస్ మ్యాన్ లు, వ్యవసాయంలో అవార్డులు పొందిన వారు ని తీర్చిదిద్దిన పాఠశాల అని మీరు అదే స్థాయిలో ఉమ్మడి జిల్లాలో ఈ స్కూలుకు మంచి పేరు తీసుకురావాలని వారన్నారు ఈ సంవత్సరం ఏ విద్యార్థులైతే 10/10 సాధిస్తారో వారికి 5000 రూపాయలు నగదు బహుమతిగా ఇస్తామని అన్నారు కచ్చితంగా మీరు 10 /10 సాధిస్తారని మాకు మీపై విశ్వాసం ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు పాఠశాల ఎస్ఎంసి సభ్యులు 1996-97 విద్యా సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు





