ప్రాంతీయం

పవర్ కట్ తో ప్రజల పరేషాన్

22 Views

పవర్ కట్ తో ప్రజల పరేషాన్

ఉదయాన్నే భానుడి భగభగలు

ఉక్కపోతతో అల్లాడిన జనం

TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం అప్రకటితో కరెంటు కోతతో భానుడి భగభగ మధ్య ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు.విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్ల కొమ్మలను కొట్టడానికి విద్యుత్ సిబ్బంది సుమారు రెండు గంటల పాటు పవర్ కట్ చేయగా ఎండ వేడిమి తాళలేక, చిన్నాచితక ముసలి ముతక తేడా లేకుండా జనమంతా ఉక్కపోతతో తలడిల్లారు.పవర్ కట్ చేసినప్పుడు విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు ముందుగా సమాచారం అందించాలని తద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకునే వీలు ఉంటుందని ప్రజలు అభిప్రాయ పడ్డారు.ఇట్టి విషయం ఏఈ దృష్టికి తీసుకెళ్లగా విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండడం కోసమే విద్యుత్తు లైన్ల వద్దగల చెట్ల కొమ్మలను కొట్టడం కోసం పవర్ కట్ చేసినట్లుగా తెలిపారు.ప్రజల సౌకర్యార్థమే రాత్రి వేళల్లో పవర్ కట్ కాకుండా ఉండడం కోసం ఉదయం పూట చెట్ల కొమ్మలను కొడుతున్నారని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *