79 పాఠశాలలు తిరిగి ప్రారంభించాం– మంత్రి దామోదర రాజనర్సింహ
డిసెంబర్ 18
రాష్ట్రంలో 6 వేల పాఠశాలలను మూసివేశారనడం సరికాదని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం శాసనమండలిలో బీఆర్‌ఎస్ సభ్యులు టి.రవీందర్ రావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2023-24 విద్యా సంవత్సరంలో జీరో ఎన్‌రోల్‌మెంట్ పాఠశాలలు 1,745 కాగా, 2024-25 విద్యా సంవత్సరంలో 1,913 ఉన్నాయని చెప్పారు. 2024-25లో జీరో ఎన్‌రోల్‌మెంట్ అయిన 79 పాఠశాలలను తిరిగి ప్రారంభించినట్టు చెప్పారు. రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో అన్ని పాఠశాలల్లో ఏఏపీసీ క్రింద పునరుద్ధరించినట్టు తెలిపారు. గత ప్రభుత్వం మధ్యలో వదిలేసిన సివిల్ వర్క్స్ పనులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. అంతకు ముందు మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ ఊరు పాఠశాలలో పనులు కూడా సగంలో ఆగిపోయాయని తెలిపారు.
