ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 8, బిసి విద్యార్థి సంఘం అద్వర్యంలో గత 20 సంవస్సారల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, వైద్య వృత్తిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సిరి హస్పిటల్ డా.పంతగని శోభారాణి మహిళ దినోత్సవ సందర్భంగా బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ శాల్వా సత్కరించారు. ఆనంతరం రవిగౌడ్ మాట్లాడుతు 20 సంవస్సరలు గా సిరిసిల్ల ప్రజలకి ఎనలేని సేవలు చేయిస్తున్న డా.శోభారాణికి ధన్యవాదాలు తెలిపారు. మహిళలు ఎంతో దైర్యం కలిగి వుండాలి అని ఎలాంటి విషయాల్లో ఐన పూర్తి అవగాహన కలిగి వుండాలని డాక్టర్ అన్నారు. ఇలా సత్కరించినందుకు బిసి విద్యార్థి సంఘం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్,మండల అధ్యక్షులు మట్టే నరేష్ లు పాల్గొన్నారు.




