ప్రాంతీయం

ఎవరి కులం ఎంతో వారికంత వాటా…! బహిరంగ సభను విజయవంతం చేయండి

9 Views

ఎవరి కులం ఎంతో వారికంత వాటా…! బహిరంగ సభను విజయవంతం చేయండి.

-బీసీ , ఎస్సీ , ఎస్ టి – జేఏసీ  జిల్లా నాయకులు ర్యాగట్ల చందు.

మిరుదొడ్డి, మే 24, తెలుగు న్యూస్ 24/7

సామాజిక న్యాయం – రాజ్యాధికారం సాధనే ధ్యేయంగా, “ఎవరి కులం ఎంతో..! వారికంత వాటా..!” అనే నినాదంతో బీసీ , ఎస్సీ , ఎస్ టి – జేఏసీ, జిల్లా కమిటి అధ్వర్యంలో జూన్ 5 వ తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన కర పత్రికను మిరుదొడ్డి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ (జేఏసీ ) నాయకులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా(బీసీ,ఎస్సీ,ఎస్టీ,జేఏసీ)నాయకులు మాట్లాడుతూ….తెలంగాణ లో ఎవరి కులం ఎంత ఉందో వారి జనాభా లెక్కల ప్రకారం వారికి అన్ని రంగాలలో సమాన వాట దక్కాలని డిమాండ్ చేస్తూ ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభ కి ముఖ్య అతిథిగా( బీసీ,ఎస్సీ,ఎస్టీ,జేఏసీ) రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజ్ గారు హాజరు అవుతారని తెలిపారు. జూన్ 5 వ తేదీ సాయంత్రం 4 గంటలకు సిద్దిపేట లోని ప్రభుత్వ బాలుర హై స్కూల్ మైదానంలో (సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రాంగణం) జరిగే ఈ బహిరంగ సభకు బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులునవీన్,రవి,శ్రవణ్,అరవింద్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *