రాజకీయం

టీఆర్ఎస్ పార్టీ లో చేరిన సీనియర్ జర్నలిస్ట్ మజీద్

18 Views

కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరిన సీనియర్ జర్నలిస్ట్ మజీద్

TS తెలుగు న్యూస్ 24/7: తెలంగాణ రక్షణ సేన పార్టీలో సీనియర్ జర్నలిస్టు చేరిక,తెలంగాణ రక్షణ సేన పార్టీలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మజీద్ సోమవారం హైదరాబాదులోని టిఆర్ఎస్ భవన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టిఆర్ఎస్ నాయకుల సమక్షంలో టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ మజీద్ తో పాటు సయ్యద్ లాల్ మొహమ్మద్,మహబూబ్ లు కూడా పార్టీలో చేరారు. పార్టీ అభివృద్ధి కోసం, ప్రజలకు సేవ చేయడానికి ముందుండాలని ఈనెల 20 నుండి మండల, నియోజకవర్గ,జిల్లా కేంద్రాలలో జెండా పండుగలు నిర్వహించాలని నాయకులకు టిఆర్ఎస్ అధినేత కవిత ఆదేశించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా మజీద్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.అధికారంలోకొస్తే కవితక్క ఆలోచన విధానం ఉచిత విద్య,ఉచిత వైద్యం అందిస్తామని అధినేత కవితక్క నినాదం నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు.29 సంవత్సరాల నుండి జర్నలిస్ట్ ఫీల్డ్ లో ఉండి ప్రజలకు,ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పరోక్షంగా ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేయడం జరిగిందన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ,రాష్ట్ర నాయకులుగా యూనియన్ లో పనిచేస్తూ జర్నలిస్టులకు కూడా సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు.ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కూడా కొన్ని సంవత్సరాలు పనిచేసి ప్రత్యక్షంగా రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరుగుతుందని అన్నారు.మజీద్ చేరికతో ఈ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టు దొరికిందని పార్టీ బలోపేతం అవుతుందని ప్రజలు ముచ్చటిస్తున్నారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ దండెం ఆనంద్,టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగు నవీనా చారి,నాయకులు వర్ధ సతీష్ కుమార్,వినయ్, కదిరే భాస్కర్ గౌడ్,కూర సురేష్,సయ్యద్ జావిద్,సుధాకర్ శర్మ,సుమలత శర్మ,గుంటుక సంపత్,కుసుమ విష్ణు, దూస వేణు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *