మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 08 వ డివిజన్ అరుణక్క నగర్ లో ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ ఆకస్మికంగా పర్యటించడం జరిగింది.
ఆరునక్క నగర్ లో గత 20 ఏండ్లుగా ఉన్న మెయిన్ డ్రైనేజీ నీ జె సి బి సహాయంతో చెట్లు మరియు పూడికను తొలగించడం జరిగింది. రానున్న వర్షాకాలం ను దృష్టి లో ఉంచుకొని డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం కొరకు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాళ ప్రేమ్ సాగర్ రావు ద్రుష్టి కి తీసుకువెళ్ళి శాశ్వత పరిష్కారం కోసం నిధులను మంజూరు చెపిస్తనని తెలియచేశారు.స్థానిక ప్రజలతో పర్యటించి డివిజన్ లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మేయర్ 08వ డివిజన్ ఇంఛార్జి అట్కాపురం సతీష్ , నస్ఫూర్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిని రాజేష్,నియోజక వర్గ అధ్యక్షులు నరిగే నరేష్,వార్డ్ ఆఫీసర్,మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఐతే రాజు, పోటు రాకేష్,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.





