ప్రకటనలు

ఓటరు జాబితాలో మ్యాపింగ్ చేయించుకోండి: తహసిల్దార్ సుజాత

130 Views

భారత ఎన్నికల సంఘం SIR ను ప్రారంభించింది

ఓటరు లిస్ట్ లో మ్యాపింగ్ చేసుకోండి

2002 ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ – ముఖ్యమైన విషయాలు

1. ఎవరి కోసం ఈ మెసేజ్?*
– 2002 తర్వాత పెళ్లి చేసుకొని అత్తగారి ఊరికి వెళ్లిన ఆడవాళ్ల కోసం.

*2. సమస్య ఏంటి?*
– మీరు పెళ్లి చేసుకున్న ఊరి 2002 ఓటర్ లిస్ట్‌లో మీ పేరు ఉండదు.
– ప్రస్తుతం ఓటర్ మ్యాపింగ్ అంతా 2002 ఓటర్ లిస్ట్ ఆధారంగానే జరుగుతోంది.

*3. మీరు ఏం చేయాలి?*
– *స్టెప్ 1*: మీరు పుట్టిన ఊరికి వెళ్లండి.
– *స్టెప్ 2*: అక్కడి 2002 ఓటర్ లిస్ట్‌లో మీ అమ్మ లేదా నాన్న పేరు, సీరియల్ నంబర్ తెలుసుకోండి.
– *స్టెప్ 3*: ఆ సీరియల్ నంబర్‌ను మీరు ఇప్పుడు ఉంటున్న ఊరిలోని BLO కి ఇవ్వండి.
– *స్టెప్ 4*: BLO ఆ నంబర్‌తో మిమ్మల్ని ఇక్కడి ఓటర్ లిస్ట్‌లో మ్యాపింగ్ చేసి చేరుస్తారు.

*4. ఇది చేయకపోతే ఏమవుతుంది?*
– మీరు మీ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది.

*5. 2002 లిస్ట్ ఎక్కడ దొరుకుతుంది?*
– ప్రతి ఊరిలో తహసీల్దార్ ఆఫీస్ నుండి 2002 ఓటర్ లిస్ట్‌ను ఆ ఊరి BLO / అంగన్‌వాడీ టీచర్‌కు ఇచ్చారు.
– మీ పుట్టిన ఊరి BLO ని కలవండి.

*6. గుర్తుంచుకోవాల్సిన విషయం:*
– ఓటు కోల్పోకుండా చూసుకోవడం మన అందరి బాధ్యత.
– అందరూ తప్పకుండా మ్యాపింగ్ చేయించుకోండి.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *