ఎల్లారెడ్డి పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ అన్నారు.బుధవారం మండల కేంద్రములోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సాంస్కృతిక విభాగం, జాతీయ సేవాపథకం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అధ్యాపకురాళ్లు,విద్యార్థినులు బతుకమ్మలు పేర్చి బతుకమ్మ పాటల పాడుతూ బతుకమ్మ ఆడారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి గొప్పదనీ,విద్యార్థులు మన సంస్కృతిని అధ్యయనం చేయాలనీ, ఇతర సంస్కృతులను గౌరవించాలన్నారు.
ప్రపంచంలో పూలతో జరిగే పండుగలు అరుదనీ,స్త్రీలు ప్రత్యేకంగా జరుపుకునే అద్బుతమైన పండుగనీ అన్నారు. ఎన్.ఎస్.ఎస్ &సాంస్కృతిక విభాగం అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ బతుకమ్మ పాటలలో ప్రాచీనం నుండి ఆధునికందాకా తెలంగాణ చరిత్ర,సంస్కృతి ఇమిడి ఉందన్నారు. బతుకమ్మ పాటలలో తెలంగాణ బతుకులు చిత్రించబడ్డాయన్నారు.
