ప్రాంతీయం

భద్రత నిర్వహణ వ్యవస్థల మెరుగుదలపై సమావేశం

33 Views

 

 

భద్రత నిర్వహణ వ్యవస్థల మెరుగుదలపై సమావేశం – సీపీ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్

సిద్దిపేట్, మే 11, తెలుగు న్యూస్ 24/7

నగరంలోని లాడ్జీలు, రిసార్ట్స్, హోటల్స్ మరియు ఫాంహౌస్ యాజమాన్యాలు, మేనేజర్లతో పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐ పీ ఎస్  ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి పలు కీలక సూచనలు చేశారు.సీపీ మాట్లాడుతూ యాజమాన్యాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి హోటల్, లాడ్జి, ఫాంహౌస్ ప్రవేశ ద్వారాల వద్ద( డి ఎఫ్ ఎం డి ) (డోర్ ఫ్రేమ్ మెటల్ డిటేక్టర్ ), హెచ్ హెచ్ ఎం డి  (హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటేక్టర్ ) ద్వారా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.అలాగే ప్రతి ప్రాంగణంలో నాణ్యమైన “సీ సీ టీ వీ ” కెమెరాలు ఏర్పాటు చేసి, కనీసం 60 రోజుల వరకు బ్యాకప్ ఉండేలా చూడాలని తెలిపారు. సంబంధిత పోలీస్ స్టేషన్” ఎస్ హెచ్ ఓ ” ఫోన్ నంబర్లను నోటీస్ బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ప్రత్యేక ఎంట్రీ – ఎగ్జిట్ గేట్లు  ఉండేలా చూడాలని, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని సూచించారు. పని చేసే ఉద్యోగులకు ఫైర్ సేఫ్టీపై ప్రాథమిక శిక్షణ కల్పించాలని తెలిపారు.పనిచేసే ఉద్యోగుల పూర్తి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగుల వివరాలను కచ్చితంగా పరిశీలించాలని, మైనర్లు ఉద్యోగాల్లో ఉండకూడదని తెలిపారు.నకిలీ ఆధార్ కార్డుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పెద్ద ఎత్తున నిర్వహించే ఈవెంట్లు, కార్యక్రమాల వివరాలను ముందుగానే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని చెప్పారు. లాడ్జీలు, హోటల్స్, ఫాంహౌస్‌లలో బసకు వచ్చే కస్టమర్ల పూర్తి వివరాలను ప్రతిరోజూ పోలీస్ స్టేషన్‌కు అందజేయాలని, వారు నిర్వహించే ప్రోగ్రాములకు పోలీస్ అనుమతి తీసుకున్నారా లేదా తెలుసుకోవాలని సూచించారు.కొత్తగా రూములు తీసుకునే వ్యక్తుల పూర్తి వివరాలు నమోదు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ -100కు కాల్ చేయాలని తెలిపారు. పోలీసులచే ఆకస్మిక తనిఖీలు నిర్వహించబడతాయని హెచ్చరించారు.లాడ్జీలు, రిసార్ట్స్, ఫాంహౌస్‌లు, హోటల్స్‌లో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా యాజమాన్యాలు బాధ్యత వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ కుషాల్కర్, ట్రైనీ ఐపీఎస్  ఆయేషా ఫాతిమా మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *