ప్రాంతీయం

గొల్లపల్లి లో ఓపెన్ జిమ్ ప్రారంభించిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్

72 Views

ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్

కేటీఆర్ సహకారంతో 4లక్షల రూపాయల నిధులతో ఓపెన్ జిమ్ ఏర్పాటు

TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ పాలకవర్గంతో కలిసి ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మాజీమంత్రి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో నాలుగు లక్షల రూపాయల నిధులతో ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.గతంలోనే బీఆర్ఎస్ నాయకుల కృషితో ఇట్టి నిధులు విడుదల కాగా అనివార్య కారణాల వలన కాస్త ఆలస్యం జరిగిందని,తమ పాలకవర్గం ఏర్పాటు కాగానే ఓపెన్ జిమ్ ఏర్పాటుకు తిరిగి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగరితిన పనులను పూర్తి చేసి గ్రామస్తులకు ఓపెన్ జిమ్ ను అందుబాటులోకి తేవడం జరిగిందని తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు,పుర ప్రముఖులు,పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *