
మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గా మందాటి రాము యాదవ్
ఉపాధ్యక్షులుగా గనగోని ధర్మాగౌడ్… మరో ఇరువురు
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం సమావేశమైన ఎల్లారెడ్డిపేట మండల పలు గ్రామాల ఉపసర్పంచులు మండల ఉపసర్పంచుల ఫోరం ఎన్నికలు నిర్వహించుకున్నారు.ఇట్టి ఎన్నికలో రాగట్లపల్లి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ మందాటి రాము యాదవ్ ను ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. సమావేశం అనంతరం వివరాలు తెలుపుతూ ఉపాధ్యక్షులుగా గనగోని ధర్మ గౌడ్, ధరావత్ లాస్య,రమావత్ మోహన్ నాయక్, ప్రధాన కార్యదర్శులుగా బొడ్డు రాజు,క్యాషియర్ గా గుర్రం విశాక్, కార్యవర్గ సభ్యులుగా కొర్రి అనిల్ కుమార్,గొట్టే శ్రీకాంత్,గోపన్నగారి కొమురయ్య,మందాటి బాబు, మునిగే రేణుక,జెల్ల ప్రశాంత్,గౌరవ సలహాదారులుగా, బందారపు బాల్ రెడ్డి,జి. మోహన్ నాయక్ లను ఎన్నుకున్నట్లుగా తెలిపారు.ఈ సందర్భంగా ఉపసర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు మందాటి రాము యాదవ్ మాట్లాడుతూ మండలంలోని గ్రామాల అభివృద్ధిలో భాగంగా ఉపసర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన వారి పక్షాన నిలబడి తక్షణమే సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ సందర్భంగా సహకరించిన మండల ఉపసర్పంచులకు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వరుస కృష్ణహరి,మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, సింగిల్ విండో చైర్మెన్ గుండారపు కృష్ణారెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఆకుల మురళీమోహన్ గౌడ్, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ ఎనగందుల నరసింహులు,తదితరులు పాల్గొని నూతనంగా ఎన్నికైన మండల ఉపసర్పంచ్ ల ఫోరం కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.





