Breaking News

అసిస్టెంట్ హెల్పర్ ను పరామర్శించిన ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్

156 Views

ప్రమాదానికి గురైన విద్యుత్ ఉద్యోగిని పరమార్శించిన ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్

మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలింపు.

TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం అసిస్టెంట్ హెల్పర్ ధ్యాప లక్ష్మణ్ ఫీజు వైరు వేస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై ట్రాన్స్ఫార్మర్ పై నుండి కిందపడి గాయాల పాలయ్యాడు. అత్యవసర చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, విషయం తెలుసుకున్న ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్,ఆసుపత్రికి చేరుకొని లక్ష్మణ్ ను పరామర్శించి,వైద్యులతో మాట్లాడారు.అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కరీంనగర్ కు తరలించి అత్యుత్తమ వైద్య సేవలు అందించే ఏర్పాటు చేస్తామని తెలిపారు.వీరి వెంట డీఈ అంజయ్య,ఏడీఈ శ్రీనివాసులు,ఏఈ పృధ్వీధర్ లు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *