
పీఏసీఎస్ చైర్మెన్ గా గుండారపు కృష్ణారెడ్డి బాధ్యతల స్వీకరణ
TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మెన్ గా గుండారపు కృష్ణారెడ్డి తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం పాలనాధికారులను నామినేటెడ్ పాలకవర్గాలను నియమించడం సరికాదని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో,గతంలో ప్రభుత్వం జారీ చేసిన 597 జీవోను ప్రభుత్వమే ఉపసంహరించుకోవడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలు రాష్ట్రంలో తిరిగి బాధ్యతలు చేపడుతున్నాయి. అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట ప్యాక్స్ చైర్మెన్ గా గుండారపు కృష్ణారెడ్డి,డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించగా వారిని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య,మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు,మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వరస కృష్ణ హరి,తదితరులు కృష్ణారెడ్డి కి అభినందనలు తెలుపుతూ శాలువాతో ఘనంగా సత్కరించారు.





