రాజకీయం

రైతుల రుణమాఫీ పట్ల హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్

166 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రైతుల రుణమాఫీ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య బుధవారం తెలిపారు.రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేయడం చరిత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు నిలిచిపోతుందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన రుణమాఫీని తిరిగి రేవంత్ రెడ్డి చేయడం ధైర్య సాహసాలకు నిదర్శనం అన్నారు.

లక్ష రూపాయల రుణమాఫీ పేరిట గత బిఆర్ఎస్ ప్రభుత్వం సాగదీసిందని ఎట్టకేలకు చేతులెత్తేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు.రేషన్ కార్డు కుటుంబ సభ్యుల ధ్రువీకరణకు మాత్రమేనని అన్నారు.రైతు భరోసా కూడా రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం సాయంత్రం రైతులతో పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరుగుతుందని రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులకు స్వీట్లు పంపిణీ చేస్తామన్నారు.ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి , కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు సూడిద రాజేందర్ గంట బుచ్చ గౌడ్,చెన్ని బాబు రామ్ రెడ్డి ,మెండు శ్రీనివాస్, గుర్రం రాములు, బండారు బాల్ రెడ్డి, తిరుపతి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్