
రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల చే అవగాహన
TS తెలుగు న్యూస్ 24/7: వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక విధానాలు మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ సాగు ఖర్చులను తగ్గించి అధిక ఫల సాయంతో మంచి ఆదాయాన్ని పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు రైతులకు సూచించారు.ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట గ్రామ సర్పంచ్ నర్సింహులు,ఏఎంసీ చైర్మన్ సబేరా బేగం, మండల స్పెషల్ ఆఫీసర్ & డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్,అఫ్జల్ బేగం,సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. పి.మాధవి, డాక్టర్. కె.ప్రీతిక,మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్,రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటల సాగులో యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించడం జరిగింది. విచక్షణారహితంగా ఎరువులను,రసాయన ఎరువులను పురుగుమందులను వాడవద్దని తద్వారా నేల,నీరు కలుషితమవుతుందని వారు సూచించారు. మట్టి పరీక్ష ఆధారంగ ఎరువులను వాడి సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు అని, సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను పొందవచ్చని వారు సూచించారు.వరి పంటతో పాటు ఇతర పంటలైన చిరుధాన్యాలు జొన్న, సజ్జ,పప్పు ధాన్యాలు అయిన మినుము పెసర నూనే గింజల పంటలైన పొద్దుతిరుగుడు, వేరుశనగ,నువ్వులు వంటి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.





