ముస్తాబాద్ మే1 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో పోరాట దృక్పథంతో మరోసారి పోరాటానికి సిద్ధంగా ఉండవలసిన సమయం ఆసన్నమైందని కార్మికులకు పిలుపునిచ్చారు. మేడే ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకల్లో సిఐటియు, సిడబ్ల్యూఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గీసబిక్షపతి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పలు కార్యాలయాలవద్ద జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కుల సాధించిన తర్వాత వేతనాలను పెంచడంలో జాప్యం చేస్తుందని కార్మికులంటే చిన్నచూపుచూస్తూ కార్మికులకు రక్షణలేకుండా పోయిందన్నారు. కార్మికులకు

రక్షణ కల్పించిన కార్మిక చట్టాలను అణిచివేయాలని ప్రభుత్వాలు చూస్తుందని ఆరోపించాడు. నాలుగు లేబర్ కోడ్ రూపంలో తీసుకువచ్చి రాష్ట్రాలలో అమలు చేయాలని చెప్పిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నాలుగు లేబర్ కోర్ల అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామపంచాయతీ కార్మికులతో పాటు తదితర మేస్త్రి, లేబర్ వృత్తి కార్మికులు పాల్గొన్నారు.




