వర్గల్ మండలం పరిధిలోని పలు గ్రామాలలో మంగళవారం కురిసిన వర్షానికి గాను పలు గ్రామాలలో పంటలను మండల వ్యవసాయ అధికారిని శేషశయన పరిశీలించారు. మంగళవారం నాడు వర్గల్ మండలంలో వర్షపాతం 15.8 ఎంఎం కురిసినది. మండలంలో వేలూరు, మీనాజ్పేట్, అంబర్పేట్, వర్గల్, గ్రామాలలో పంటలను వ్యవసాయ అధికారిని పరిశీలించారు, మండలంలో ఎక్కడ పంట నష్టం వాటిల్ల లేదని తెలిపారు. వరి పంటలు, పాలు పోసుకునే దశ నుంచి గింజ పట్టే దశలో ఉన్నాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న ఆకాల వర్షాలకు గింజ కుళ్ళి పోవడం, గింజ నల్లబడటం వంటివి జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ ఎక్కడైనా గాలికి వరి పైరు నేల కోరిగితే నేలపై ఒరిగిన వరి పంటలను పైకి లేపి జడచుట్లు వేసుకోవాలని సూచించారు. గింజ గట్టిపడే దశలో అధిక వర్షాలు పడినట్లయితే వారిపై ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేస్తే రంగు మారదని సూచించారు. అనగా 50 గ్రాముల ఉప్పు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు. వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ధర్మేంద్ర, భారతి, క్రాంతి కుమార్,మరియు రైతులు పాల్గొన్నారు.
