Breaking News

బొప్పాపూర్ లో తగలబడ్డ గడ్డి ట్రాక్టర్

426 Views

విద్యుత్తు తీగలు తగిలి ట్రాక్టర్ గడ్డి దగ్ధం

వెంటనే స్పందించిన స్థానికులు మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది

 

TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. బొప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు కోరుట్ల పేట గ్రామానికి చెందిన ట్రాక్టర్ లో గడ్డి కట్టలను నింపుకొని తన బర్ల షెడ్డు వద్దకు తరలిస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ విద్యుత్తు తీగలను గమనించకపోవడంతో గంగమ్మ గుడి ప్రాంతంలో ట్రాలీలోని గడ్డి కట్టలకు నిప్పు అంటుకొని తగలబడింది.అప్రమత్తమైన డ్రైవర్ ఇంజన్ ను ర్యాలీ నుండి వేరు చేసి దూరంగా నిలపాడు,వెంటనే సమాచారం అందుకున్న మాజీ ఎంపీటీసీ ఇల్లెందుల శ్రీనివాస్ రెడ్డి స్థానికుల సహకారంతో దగ్గరలో ఉన్న పశువుల తొట్టి నుండి నీటిని తీసుకొని చల్లార్చడంతో పెను ప్రమాదం తప్పింది.సుమారు 30 వేల రూపాయల గడ్డి నష్టపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *