
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన తహసిల్దార్ సుజాత
– రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండల తహసీల్దర్ సుజాత మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం తో పాటు రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను సందర్శించారు.రైతులతో మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు నిర్వహణ కు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించి సెంటర్ నిర్వాహకులకు ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని పలు సూచనలు చేశారు.ఇక్కడ ఆర్ఐ శ్రావణ్ కుమార్,సెంటర్ నిర్వాహకులు,రైతులు కలరు.





