వ్యవసాయం

వ్యవసాయ అనుబంధ రంగానికి పెద్దపీట

191 Views

ఎల్లారెడ్డి పేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దీర్గకాళిక రుణాలకు సంబందించిన నలుగురు రైతులకు 11,00,000/- లక్షల రూపాయల రుణాన్నిలబ్దిదారుల కు అందజేసారు.
వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి పరచడం కొరకు మంత్రికేటీఆర్ గారి సూచన మేరకు, TESCAB క్యాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు గారి సహకారంతో దీర్గకాళిక రుణాలు పెద్ద ఎత్తున ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా పంపిణి చేయటం జరుగుతుంది అని పి ఏ సీ ఎస్ అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి తెలిపారు.
రైతులు ఆర్ధిక స్వావలంబన సాదించాలంటే వ్యవసాయం తో పాటు దాని అనుబంద రుణాలు అయిన డైరీ,గొర్రెలు ,పట్టు పురుగులు,కోళ్ళపెంపకం,బోరు మోటార్ పైప్ లైన్, ట్రాక్టర్,హార్వేస్టర్ లకై సహకార సంఘాలు ఇచ్చే ధీర్గకాలిక రుణాలు వాడుకొని ముందుకు సాగాలని వారు కోరారు.
లబ్దిదారులు-యాసర వేణి అంజయ్య( సింగారం) 6,00,000రూపాయలు,
దాసరి శ్రీనివాస్(రాగట్ల పల్లి) 5,00,000రూపాయల
చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమములో సంఘ ఉపాధ్యక్షులు జంగిటి సత్తయ్య,డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, నాయకులు హాసన్ సంఘ సిబ్బంది, రైతులు తది తరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7