పేదరికంలో పుట్టి
డాక్టర్ వృత్తి లో స్థిర పడిన
పేదల దేవుడు డాక్టర్ సురేందర్ మృతి శోచనీయంఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించిన 1987- 88 ఎస్ ఎస్ సి బ్యాచ్
పూర్వ విద్యార్థులు
TS తెలుగు న్యూస్ 24/7: పేదరికంలో పుట్టి డాక్టర్ వృత్తి లో స్థిర పడి పేదలకు వైద్యం అందించిన పేదల దేవుడు డాక్టర్ సురేందర్ మృతి చెందడం శోచనీయం అన్నారు,రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన సురేందర్ నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తూ తమ క్లాస్మేట్ డాక్టర్ జీడి సురేందర్ గుండెపోటుతో ఇటివల మరణించడం బాధాకరమని 1987- 88 ఎస్ఎస్సి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు పాటు మౌనం పాటించారు,డాక్టర్ సురేందర్ అమర్ రహే,,,,,, అమర్ రహే,,,,,, డాక్టర్ సురేందర్ కు జోహార్,,,,,,జోహార్లు,,,,,, అని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆయన క్లాస్మెంట్లు గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ మాజీ సర్పంచ్ భూమరాజం మాట్లాడుతూ పేదరికంలో పుట్టి పెరిగి ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివి వైద్య వృత్తిని ఎంచుకొని ఉన్నత లక్ష్యంతో చదువుకొని నిర్మల్ జిల్లా బైంసా పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి సూపరీటెండెంట్ గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ సురేందర్ అక్కడి ప్రాంత పేద ప్రజలకు దేవుడయ్యాడన్నారు,
సురేందర్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు, మరో క్లాస్మెంటు ప్రభుత్వ ఉపాధ్యాయులు కదిరే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తమ క్లాస్మెంటు సురేందర్ డాక్టర్ వృత్తిని చేపట్టడం పట్ల తాము ఎంతో గర్వపడ్డామని అటువంటి వ్యక్తి గుండెపోటుతో మరణించడం తాము తట్టుకోలేక పోతున్నామన్నారు ఆయన కుటుంబానికి క్లాస్ మెంట్లందరం అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు,మరో క్లాస్ మెంట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చిన్నతనంలో ఎంతో కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత లక్ష్యంతో డాక్టర్ వృత్తిని ఎంచుకొని బైంసా ప్రాంత ప్రజలకు వైద్య సేవలు చేసి పేదల డాక్టర్ అయ్యాడని ఆయన అంతిమయాత్రకు తరలివచ్చిన జన సముద్రమే నిదర్శమని ఆయన గుర్తు చేశారు
ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అతని పెద్ద కూతురుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ఆయన చిత్రపటానికి నివాళులర్పించడానికి వచ్చిన క్లాస్మెంట్లు ప్రభుత్వాన్ని కోరారు,ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు బండారి బాల్రెడ్డి బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎడ్ల సందీప్ క్లాస్మేట్లు గుండాడి వెంకట్ రెడ్డి జాఫర్ షరీఫ్ హాజీ బాబా గంట రమేష్ గౌడ్, గంట నారాయణ గౌడ్,పబ్బ రాజు,ప్రభుత్వ ఉపాధ్యాయులు బాయికాడి రామచంద్రం,రవి తదితరులు పాల్గొని నివాళులర్పించారు.






