వ్యవసాయం

ఆయిల్‌ పామ్‌తో అధిక సుస్థిర లాభాలు

117 Views

సిరిసిల్ల 26, అక్టోబర్ 2022:
ఆయిల్‌పామ్‌ సాగుకు మన నేలలు అనుకూలమని, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే ఆయిల్‌పామ్‌ సాగు వైపు రైతు లు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
బుధవారం క్షేత్ర సందర్శనలో భాగంగా జిల్లా కలెక్టర్ చంద్రంపేట లోని పామ్ ఆయిల్ నర్సరీ ని సందర్శించారు.
నర్సరీ కి సంబంధించిన వివరాలను కంపెనీ అధికారులతో అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఎల్లారెడ్డి పేట మండలం రాజన్న పేట గ్రామంలోని పాతూరి భూపాల్ రెడ్డి , ఓరుగంటి అభినయ్ పామ్ ఆయిల్ తోటను సందర్శించారు.రైతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
పామ్ ఆయిల్ తోటలు వేసుకుంటే వచ్చే లాభాలు మరియు సబ్సిడీ గురించి క్లుప్తంగా వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చి రైతులు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగు చేయాలని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఆయిల్‌ పామ్‌ చెట్టు జీవితకాలం సగటున 30-40 సంవత్సరాలు కాగా అప్పటి వరకు పంట కాస్తుందని అన్నారు.
ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫామ్ తోటలను పెంచే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు.
జిల్లాలో ఈ సంవత్సరం 1800 ఎకరాలు సాగు లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటి వరకు 760 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని మిగతా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లాభదాయక ఆయిల్ ఫామ్ పంట సాగును చేపట్టాలని కోరారు.
క్షేత్ర సందర్శనలో కలెక్టర్ వెంట జిల్లా ఉద్యాన అధికారి ఎం జ్యోతి, క్లస్టర్ అధికారి ఎం.స్రవంతి, జైన్ కంపెనీ ఏరియా మేనేజర్ దివాకర్ రెడ్డి ,జైన్ అగ్రొనమిస్ట్ ప్రసాద్ గారు, పామ్ ఆయిల్ కంపెనీ అధికారులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7