ఆధ్యాత్మికం

గో ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని తహసిల్దార్ కు విజ్ఞాపన పత్రం అందజేత

22 Views

గో సంరక్షణ చేపట్టాలని
తహసీల్దార్ కు విజ్ఞాపణ పత్రం

గో ఆరాదన గో ప్రచార ఉద్యమ ప్రతినిధి
ధ్యాప దేవయ్య

TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్లజిల్లా/ ఎల్లారెడ్డిపేట ఏప్రిల్ 27: గో ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని గోవుల సంరక్షణ చేపట్టాలని కోరుతూ ఎల్లారెడ్డి పేట తహసీల్దార్ సుజాత కు సోమవారం గో ఆరాధన,గో ప్రచార ఉద్యమ ప్రతినిది ధ్యాప దేవయ్య ఆధ్వర్యంలో విజ్ఞాపన పత్రం అందజేశారు.ఈ సందర్భంగా గో ఆరాధన ప్రచార ఉద్యమ ప్రతినిధి ద్యాప దేవయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భారతీయ సంస్కృతి రాజ్యాంగానుసారంగా అహింసా మార్గంలో భారతీయ గో అంశ రక్షణ కొరకు జరిగే ఆరాధన కార్యక్రమాలను గౌరవించి ఆదరించాలని ఆయన కోరారు.భారతదేశంతో పాటు మన రాష్ట్రంలో,జిల్లాలో,మన మండలంలో మన గ్రామంలో గోహత్యను రూపుమాపుట కొరకు అందరూ కృషి చేయాలని అందుకు అధికారులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.గో సేవ కొరకు కేంద్ర చట్టమును గో సేవ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.గో పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి వేద లక్షణాలు కలిగి ఉన్న గో ఆధారిత పంచగవ్య ఉత్పాదనల కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.ఈ గో సేవ,గో రక్షణ,గో ఆరాధనకు సంబంధించి దేశవ్యాప్తంగా జరిగే నిస్వార్థ సేవలో ప్రచారం చేయాలన్నారు.గో ఆరాధన దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27వ తేదీన రాజకీయ పార్టీలకు అతీతంగా గోమాత సంరక్షణ కొరకు తహసిల్దార్ సుజాత ద్వారా భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బండారి బాల్ రెడ్డి,వివిధ పార్టీల ప్రతినిధులు గుండాడి వెంకట్ రెడ్డి, చెన్ని బాబు,దుంపెన రమేష్, తిరుపతిరెడ్డి,తడకల దేవరాజు,మాలోత్ సాయి కిరణ్ నాయక్, మిర్యాలకర్ బాబు,వంగల రాజు, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *