ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 9, గూడెం గ్రామంలో శ్రీ చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు నామాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద యువతి గొడుగు లక్ష్మి నాంపల్లి కార్ల పుత్రిక అంజలి వివాహానికి గాను పుస్తె,
చీర బహుకరించడం జరిగింది నిరుపేద కుటుంబానికి చెందిన గొడుగు నాంపల్లికి ముగ్గురు కూతురులే కావడంతో అతని యొక్క ప్రథమ పుత్రిక వివాహానికి గాను శ్రీ చిట్టిని వెంకటేశ్వరావు సహాయం అందించడంతో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ముస్తాబాద్ మండలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహించిన శ్రీ చిట్టిని మాధవి వెంకటేశ్వరరావు నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ముస్తాబాద్ మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ గొడుగు శంకర్ తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ చిట్టిని ఆంజనేయరావు మరియు గూడెం గ్రామ సర్పంచి శ్రీనివాసరావు, గూడెం ఎంపీటీసీ అదేవిధంగా నామాపూర్ గ్రామం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చికోటి నర్సింలు, దాసర శ్రీను, మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ గొడుగు శంకర్ పాల్గొన్నారు.




