
సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తహసిల్దార్ సుజాత
TS తెలుగు న్యూస్ 24/7: మండలంలో డిజిటల్ గణనను తహసిల్దార్ సుజాత మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎనగందుల నర్సింలు వివరాలను నమోదు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.జనాభా లెక్కల నమోదుకు సంబంధించి మొదటి దశలో చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి సంబంధించి తహసిల్దార్ వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రావణ్ కుమార్,వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.





