
స్మశానంలో వెలిసిన పోషమ్మ తొలగించిన ఆర్ఐ శ్రావణ్ కుమార్
-ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు,రెవెన్యూ అధికారుల చర్యలు
TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం వెంకటాపూర్ గ్రామంలో స్మశాన వాటికలో వెలసిన పోషమ్మ విగ్రహాలను ఉన్నతాధికారుల సూచన మేరకు తొలగించారు. స్మశానవాటికకు సంబంధించిన స్థలంలో అదే గ్రామానికి చెందిన ఓ వర్గం వారు పోషమ్మ విగ్రహాలను నెలకొల్పారు.గ్రామానికి సంబంధించిన స్మశానానికి చెందిన స్థలంలో పోచమ్మ విగ్రహాలను పెట్టడం ఏంటని ఆగ్రహించిన గ్రామస్తులు తహసిల్దార్ కార్యాలయంలో పిర్యాదు చేశారు. తహసిల్దార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్ఐ శ్రావణ్ కుమార్ విచారణ చేపట్టారు.సర్వే లో ఆన్లైన్లో మ్యాపింగ్ స్మశాన వాటికకు సంబంధించిన స్థలంగా గుర్తించారు.గ్రామస్తులను విచారించగా స్మశాన వాటికలో దహనసంస్కారాలు నిర్వహించిన అనంతరం ఈ స్థలానికి వచ్చి స్నానాలు ఆచరించే వారమని గ్రామస్తులు తెలిపడంతో విచారణ ముగించిన అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు.ఉన్నతాధికారుల ఆదేశాలు అందుకున్న రెవెన్యూ,పోలీసు అధికారులు శనివారం ఉదయం స్మశాన వాటికకు వెళ్ళి పోచమ్మ విగ్రహాలను తొలగించి తరలించారు.ఈ సంఘటనలో ఆర్ఐ చూపిన తెగువ,సమయస్ఫూర్తిని పలువురు అభినందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై రాహుల్ రెడ్డి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.





