సెమీ క్రిస్మస్ ను విజయవంతం చేద్దాం.
మండల ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఆహ్వానం తెలిపిన ఎల్లారెడ్డిపేట మండల పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు..
ఎల్లారెడ్డిపేట.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం నిర్వహించ తలపెట్టిన సెమీ క్రిస్మస్( ముందస్తు ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు)
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎల్లారెడ్డిపేట మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ క్రీస్తు దాసు గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 2000 సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో జన్మించి 33½ సంవత్సరములు భూవిపై జీవించి శాంతి సందేశాన్ని అందించి ప్రజలు సన్మార్గంలో ప్రయాణించాలని బోధించి సర్వ మానవాళి పాప విమోచన కొరకై సిలువపై మరణించి మూడవ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్లారని, ఈ రక్షణసు వార్తను ప్రజలకు తెలిపే ఉద్దేశంతో సెమీ క్రిస్మస్ వేడుకలను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుoదని, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఏసుక్రీస్తు రక్షణ సువార్తను విని రక్షణ పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు..




