విగ్రహాల తొలగింపు..
TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్లజిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామంలో స్మశాన వాటికకు సంబంధించి దహన సంస్కారాల అనంతరం స్నానాలు ఆచరించే స్థలంలో,ఓ సామాజిక వర్గానికి చెందినవారు విగ్రహాలను ఏర్పాటు చేయగా,విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.విచారణలో ఆ స్థలం స్మశాన వాటికకు సంబంధించి దహన సంస్కారాల అనంతరం స్నానాలు ఆచరించే స్థలంగా గుర్తించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలను పోలీసు,రెవెన్యూ శాఖ అధికారులు తొలగించి తరలించినట్లు సమాచారం.ఆ పరిసర ప్రాంతాల్లో బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






