నిరుపేద కుటుంబానికి పాలిథిన్ కవరు అందజేసిన గద్ధల సురేష్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో ఆదివారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ యువ నాయకుడు గద్ధల సురేష్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబం మస్కూరి శ్రీనివాస్ కు ఇంటి పైన కప్పుకోవడానికి పాలిథిన్ కవరు అందజేశారు ఈ సందర్భంగా గద్దల సురేష్ మాట్లాడుతూ వరుసగా కురుస్తున్న వర్షాలకు మాస్కురి శ్రీనివాస్ ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉన్నదని తెలుసుకుని ఇంటి పైన కప్పుకోవడానికి పాలిథిన్ కవరు అందజేయడం జరిగిందని వరుసగా కురిసిన వర్షాలకు చాలా వరకు కొన్ని ఇండ్లు పాక్షికంగా,కూలిపోయాయి అని వారిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని మానవతా దృక్పథంతో ఒక నిరుపేద కుటుంబానికి నా వంతు సహాయం చేయడం జరిగిందని మరింత మందికి నా వంతు సహాయం చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సందీప్,గణేష్,మధు తదితరులు పాల్గొన్నారు
