తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లకు జూమ్ సమావేశం..
సిద్దిపేట్, ఏప్రిల్ 25, తెలుగు న్యూస్ 24/7
సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో సెన్సెస్ -2027 ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు స్వీయ గణన(సెల్ఫ్ ఎమ్యునరేషన్) ప్రక్రియ గూర్చి తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ లకు జిల్లా కలెక్టర్ కె. హైమావతి జూమ్ సమావేశం ద్వారా దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెన్సస్ 2027లో భాగంగా,జిల్లాలో స్వీయ గణన ప్రక్రియను ఏప్రిల్ 26, 2026 నుండి మే 10, 2026 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సెల్ఫ్ ఎమ్యునరేషన్ ప్రక్రియ ప్రచారం చెయ్యడానికి ఏప్రిల్ -26 రోజున జిల్లాలోని స్థానిక ఎమ్మెల్యే, ఏంపి, జడ్జి, ఏంఎల్ సి లకు ముందస్తు సమాచారం అందించి స్వగృహం లో నిర్దేశిత వెబ్‌సైట్ [సే .సెన్సుస్ .గవర్నమెంట్ .ఇన్ ]లో సెల్ఫ్ ఎమ్యునరేషన్, జియో టాగింగ్ ప్రక్రియ ఎమ్యునరేటర్లు చేయించాలని అధికారులను ఆదేశించారు.ఇప్పటికే రెండు బ్యాచ్ వారిగా ఎమ్యునరేటర్లకు శిక్షణ అందించామని తెలిపారు.ప్రతి మండలంలో గ్రామాల వళ్ళు గా గ్రామాల్లో సర్పంచ్, గ్రామాల్లో పలువురు ప్రముఖులు, మహిళ సమాఖ్య అధ్యక్షులు, సెల్ఫ్ ఎమ్యునరేషన్, జియో టాగింగ్ ప్రక్రియ చేసుకునేల చర్యలు తీసుకోవాలని తహసిల్దార్, ఏంపిడిఓ లను ఆదేశించారు. అలాగే మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు లచే సెల్ఫ్ ఎమ్యునరేషన్ చేయించాలని కమిషనర్ లకు ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు వారి స్వంత గృహాల వద్ద సెల్ఫ్ ఎమ్యునరేషన్ చేసుకోవాలని తెలిపారు.ఈ డిజిటల్ విధానం ద్వారా పౌరులు ఎటువంటి ఆటంకం లేకుండా, ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ ద్వారా తమ ఇంటి వివరాలను నమోదు చేసుకోవచ్చని, తద్వారా గణన ప్రక్రియ మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా వేగంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.జిల్లా ప్రజలందరూ సెల్ఫ్ ఎమ్యునరేషన్ ఈ డిజిటల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సెన్సస్ 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనితెలిపారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియ జిల్లాలో వేగం పెంచాలని ఆదేశించారు. రోజు వారిగా ఇచ్చిన టార్గెట్ ఆధారంగా ఈ నెల 30 వరకు ఎలెక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి పూర్తి చెయ్యాలని తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్ లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగరాజమ్మ, జెడ్పీసిఈఓ రమేష్, డిపిఓ రవీందర్, సెక్టోరల్ అధికారి రామస్వామి, సూపరిండేంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.





