
రైతులు దళారులను నమ్మి తక్కువ రేటుకు ధాన్యాన్ని అమ్ముకొని నష్టపోవద్దు: సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య
-కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు,చేతల ప్రభుత్వం: ఏఎంసీ చైర్ పర్సన్ షేక్ సభేరా బేగం.
TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో ఆధ్వర్యంలో నారాయణపూర్,వెంకటాపూర్ గ్రామాల రైతుల సౌకర్యార్థం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఏంసి చైర్ పర్సన్ షేక్ సాభేరా బేగం. మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దోమ్మాటి నర్సయ్య,మెడిశెట్టి పద్మ బాలయ్య లతో కలిసి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏఎంసి చైర్ పర్సన్ షేక్ సబేరా బేగం.డీఎస్ఓఎల్ బుచ్చిబాబు,సర్పంచ్ దోమ్మాటి నర్సయ్య లు మాట్లాడుతూ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తుందన్నారు,
కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని,చేతల ప్రభుత్వమని తెలిపారు.వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని,దళారులను నమ్మి తక్కువ రేటుకు ధాన్యాన్ని అమ్ముకొని నష్టపోవద్దని కోరారు.ఈ కార్యక్రమంలో డిఎంఎస్ నరసింహ,ఏఎంసి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి, పీఏసీఎస్ స్పేషల్ ఆఫీసర్ శఫీయోద్దీన్,ఉప- సర్పంచ్ లు నిమ్మ మధుసూదన్ రెడ్డి,గొట్టే శ్రీకాంత్,
పీఏసిఎస్ సేక్రెటరీ అజయ్ కుమార్,డైరెక్టర్లు మెండే శ్రీనివాస్ యాదవ్,గంట చిన్న లక్ష్మీ బుచ్చా గౌడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి,షకీల్ పాక్స్ సిబ్బంది,దేవిరెడ్డి,మెడిశెట్టి రమేష్, సెంటర్ ఇంచార్జీలు రైతులు యాదిరెడ్డి,గెంటే శ్రీను,సందేవేణి భూమయ్య,దుబ్బు కిషన్,నిమ్మ మల్లారెడ్డి,లక్ష్మణ్, అశోక్,బుచ్చిరెడ్డి వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




