
పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు శ్రీమంతం నిర్వహణ.
స్క్రీన్ ప్లే టైం తగ్గిద్దాం ఆరోగ్యకరమైన బాల్యం అందిద్దాం: ఐసీడీఎస్ ఈఓ వనిత
TS తెలుగు న్యూస్ 24/7: ప్రతి చిన్నారి సమతుల్య జీవనశైలి వైపు దారితీయడమే లక్ష్యంగా ముందుకు నడవాలనీ ఐసిడిఎస్ ఈఓ వనిత అన్నారు.
ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్,బాకూర్ పల్లి తండా గ్రామంలో పోషణ్ పక్వాడ కార్యక్రమంలో బాగంగా బుధవారం గర్భవతులకు శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ఈఓ వనిత పాల్గొని మేకల పూజితకు శ్రీమంతం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈఓ వనిత మాట్లాడుతూ ఈ నెల 9 నుండి 23 వరకు పోషణ్ పక్వాడ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.అందులో భాగంగా గర్భవతులకు,బాలింతలకు ప్రతి చిన్నారి సమతుల్య జీవనశైలి పై అవగాహన కల్పిస్తున్నామన్నారు.స్క్రీన్ టైం అధికంగా ఉంటే కలిగే హానికర ప్రభావాలు వివరించారు.తల్లిదండ్రుల పాత్రపై ప్రత్యేకంగా చర్చించారు.సేఫ్ డిజిటల్ హ్యాబిట్స్ అవగాహన వయస్సుకు అనుగుణంగా స్క్రీన్ టైమ్ పరిమితులు వివరించాలని భోజనం సమయంలో,నిద్రకు ముందు మొబైల్ వినియోగం నివారించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలని,
వీడియో సందేశాల ప్రసారం,స్క్రీన్ టైమ్ పనులపై వీడియోలు ప్రదర్శించారు.సురక్షిత వినియోగం పై సందేశాలు పంచాలని,గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,చదవడం,కథలు చెప్పడం,ఆటలు ఆడించడం వంటివి అలవాటు చేయాలనీ,అవుట్‌డోర్ యాక్టివిటీస్ ను ప్రోత్సహించాలని,కుటుంబంతో కలిసి సమయం గడపడం పై దృష్టి పెట్టాలన్నారు.తల్లిదండ్రులతో అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. పిల్లల అభివృద్ధిలో సమాజ పాత్ర పై,గ్రామ పెద్దలు, టీచర్లు,అంగన్వాడి సిబ్బంది పాఠశాలలు, పంచాయతీలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించారు, సరళమైన భాషలో తల్లిదండ్రులకు వివరించామని చర్చల్లో పిల్లలను కూడా భాగస్వామ్యం చేశామని తెలిపారు.ఫోటోలు,వీడియోలు తీసి గ్రూపుల్లో అప్లోడ్ చేసారు.తల్లిదండ్రులతో తిరిగి సంప్రదించి మార్పులు పరిశీలించాలన్నారు.చిన్నారుల మానసిక,శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని,స్క్రీన్ వినియోగాన్ని పర్యవేక్షించాలని,అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలన్నారు.మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఐసిడిఎస్ ఈఓ వనిత కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడ్డు జయశ్రీ, ఎంఎల్ హెచ్పి శిల్ప,అంగన్వాడి టీచర్ వనిత,ఆశా వర్కర్ జల్లి తార,ఐసిపిఎస్ భార్గవి, ఉపాధ్యాయులు వనజ,శ్రీజ,చిన్నారుల తల్లులు మమత,దేవవ్వ,రాజవ్వ,నర్సవ్వ పూజిత అనిత తదితరులు పాల్గొన్నారు.





