Breaking News

నూతనంగా ఏర్పడిన నాలుగు పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం

7 Views

రామగుండం పోలీస్ కమీషనరేట్ లో నూతనంగా ఏర్పడిన నాలుగు పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం.

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మంజూరైన పోలీస్ స్టేషన్లను ఈరోజు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, బాను ప్రసాద్ రావు లు, రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., పెద్దపల్లి కలెక్టర్ శ్రీ కోయ హర్ష, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ లు తదితరులతో కలిసి నూతనంగా మంజూరైన ఎలిగేడు పోలీస్ స్టేషన్, పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లను ప్రారంభించారు.

నూతన పోలీస్ స్టేషన్ ల ఏర్పాటుకు మంత్రి , స్థానిక ఎమ్మెల్యే  చేసిన ప్రయత్నం, కృషి ఫలితగా ఒక రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోనే నాలుగు పోలీస్ స్టేషన్లను మంజూరు కావడం జరిగింది అని ఇది గొప్ప విషయం అన్నారు. నూతనంగా ఏర్పడిన పోలీస్ స్టేషన్లో అధికారులకు సిబ్బంది అనుభవం కలిగిన వారిని ఇవ్వడం జరిగింది. అదే విధంగా వారికి క్రైమ్ ఫై, రిసెప్షన్ డ్యూటీస్ లపై సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. నూతన పోలీస్ స్టేషన్ ల ద్వారా ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ సమస్యలు మరింత తొందరగా పరిష్కారమయ్యే అవకాశం ఏర్పడింది. ప్రజలకు నమ్మకం భరోసా కలిగే విధంగా విధులు నిర్వహిస్తామని సీపీ తెలిపారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్