Breaking News

గుండారం ప్రైమరీ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

162 Views

ప్రైవేటు కు దీటుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేద్దాం: సర్పంచ్ సరోజ చంద్రు నాయక్

TS తెలుగు న్యూస్ 24/7: రాచర్ల గుండారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ ముడావత్ సరోజ చంద్రు నాయక్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు దీటుగా చదువులు చెబుతున్న పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. ప్రైవేటు పాఠశాల మాదిరిగా గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించడం, అట్టి కార్యక్రమానికి తల్లిదండ్రులను ఆహ్వానించడం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే ఆలోచనలో ఓ భాగమని అన్నారు.గ్రామస్తుల సహకారంతో,పాలక వర్గం సహకారం తో రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచి నాణ్యమైన విద్యా బోధనకు కృషి చేస్తామని తెలిపారు.మన గ్రామంలో పిల్లలని ప్రభుత్వ పాఠశాలకి పంపే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని సర్పంచ్ సరోజ చంద్రు నాయక్,ఉప సర్పంచ్ జెట్టి కిషన్ గ్రామస్తులను కోరారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,వార్డ్ సభ్యులు అమల,హరీష, పాఠశాల సిబ్బంది, పాఠశాల కమిటీ సభ్యులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *