*హసన్ పర్తి రేణుక ఎల్లమ్మ దేవాలయంలో దొంగలు పడ్డారు*
హాసన్ పర్తి: ఆగస్టు 04
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసి నానా బీభత్సం సృష్టించారు.
స్థానికులు, హసన్ పర్తి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… అమ్మవారికి చెందిన బంగారం, వెండిలతో పాటు అమ్మవారి వడ్డాణం, హుండీలను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.
ఎత్తుకెళ్లిన హుండీలను పగులగొట్టి నగదు తీసుకుని హసన్ పర్తి గుడి వెనుక భాగం వైపు వదిలేసినట్లు పేర్కొన్నారు.
నగదు సుమారు రూపాయలు 40 వేలు వరకు ఉంటుందని స్థానికులు, ఆలయ పూజారి తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు…..
