
పేద యువతీ వివాహానికి సర్పంచ్ ఆర్థిక సహాయo
TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలోని ఓ మైనార్టీ పేదింటి యువతి వివాహానికి ఆ గ్రామ సర్పంచ్ చిర్రం నాగరాజు ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బుధవారం అందించి వారి కుటుంబానికి అండగా నిలిచారు.కడు నిరుపేద కుటుంబానికి చెందిన జహెరా పెద్దకూతురు వివాహం ఉండడంతో. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని వెంటనే వారి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి తన వంతు సహాయంగా 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.ఇంకా ఎవరైనా దాతలు సహాయం చేయదలచిన వారు స్పందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రొడ్డ రామచంద్రం,పంతంగి మల్లయ్య,రమేష్ తదితరులు పాల్గొన్నారు.





